Yudaya Bethlemu Song Lyrics | యూదయ బెత్లెహేము Song Lyrics | Telugu Christmas Songs Lyrics
యూదయ బెత్లెహేము పురమునందు లోకరక్షకుడు జన్మించెను
ఆ నింగి మెరిసింది
ఈ నేల మురిసింది
ఊరంతా పరవశం అయింది
హ్యాపీ క్రిస్మస్ పండుగ చేద్దామా
ఊరువాడ సంబరమే చేద్దామా
చరితలోన యేసు జననం ఆదికాల నిర్వచనం
సర్వభూమి యేసు సొంతం సత్య వాక్కే తన ధ్యేయము
ఆ మహిమ లోకం వీడి ఈ భువికి వచ్చినాడు
ఆ పశుల పాకలోన పావనుడై పవళించాడు
అసమానమైన జన్మ తానొందినాడు..
యేసు జాడ దూత తెలుపగా విదితమాయెను గొల్లలకు
తార వెంబడి నడిచినారు సంతసముతో ఆజ్ఞానులు
దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడని
లోకాలనేలే రాజు ఈ భువికి వచ్చాడని
సంతోష గానాలతో సందడి చేసే...
*********************************************
Lyrics & Tune : Sunil Kumar. Y
Vocals : Sunil Kumar. Y , Sujatha.Y , Deevena Carol , Nycil kk