Veligindi Ee Lokam Song Lyrics | వెలిగింది ఈ లోకము Song Lyrics | Telugu Christmas Songs Lyrics
వెలిగింది ఈ లోకము
మురిసింది నా హృదయము
మదినిండా సంతోషము
యేసయ్య నీ జన్మము
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ
తనకిష్టులైన మనుషులకు సమాధానము
Happy happy Christmas
Merry Merry Christmas
1. మనుష్య కుమారునిగా అరుదెంచి
మనుజావతారునిగా దిగివచ్చి
పాపము శాపమును తొలగించి
ప్రతి మనిషి హృదయమును వెలిగించి
పరమును వీడి వరముగా వచ్చిన
నా యేసయ్య.. “యేసయ్య “
2. పాపపు లోకములో పయనించి
పాపము లేకుండా జీవించి
చీకటి రాజ్యాన్ని కూల్చేసీ
వెలుగు రాజ్యాన్ని స్థాపించి
చనిపోయిన మము లేపగ వచ్చిన
మా యేసయ్య…. “యేసయ్య “
3. తండ్రి తనయునిగా తలవంచి
మనుషుల పాపముకై మరణించి
చీకటి గుండెలను చీల్చేసి
కాంతి రేఖలను ప్రసరింపజేసి
పాపుల కొరకు ప్రాణం పెట్టిన
మా యేసయ్య…. “యేసయ్య “
********************************************
Lyrics,Tune & Produced by - Pas.Moses
Music - Dr.J K Christopher
Vocals - Sis Lillian Christopher