Unnathamainadi Nee Prema Song Lyrics | ఉన్నతమైనది నీ ప్రేమ Song Lyrics | Telugu Christian Worship Songs Lyrics
పల్లవి: ఉన్నతమైనది నీ ప్రేమ యేసు.... యేసు
ఎంతో గొప్పది నీ ప్రేమ క్రీస్తు... క్రీస్తు (2)
తరాలు మారిన మరువని నీ ప్రేమ.....
యుగాలు గడిచిన నిలిచిన నీ ప్రేమ....(2)
ఆకాశపు అంచునైనాదాటిన నీ ప్రేమ
నా పాపపు బ్రతుకునైనామార్చిన నీ ప్రేమ(2)
ప్రేమా ప్రేమా నిజమైనది నీ ప్రేమ
ప్రేమ ప్రేమ నిస్వార్ధమైనది నీ ప్రేమ
ప్రేమ ప్రేమ ఇది కన్న తండ్రి ప్రేమ
ప్రేమా ప్రేమా నన్ను కరుణించినది నీ ప్రేమ
చరణం: భూతలమంతయు కాగితమైన
నీ ప్రేమను లిఖించుటకు సరిపోదయ్య
జల రాసులు అన్నియు సిరాగా మారిన
నీ ప్రేమను వర్ణించుటకు కొదువేనయా(2)
నా జీవిత కాలమును వెయ్యేండ్లు పొడిగించిన
విశ్వము కన్నా విశాలమైన నీ ప్రేమ లోతును
విశదీకరించుట నా తరమా
యేసయ్య....
Ilప్రేమా ప్రేమా ll
చరణం: విశ్వ తారలన్నీయు ఏకమై చేరిన
నీ మహిమకు సాటి రావు సరితూగ లేవయ్యా
కోట్ల దూతల అన్నియు గలమెత్తి పాడిన
నీ స్వరము కు సాటి రావు సరే పోల్చ లేనయ్యా (2)
నా పాప దోషములు ఇన్నేళ్లు భరించిన
మారణము గెలిచి జీవమునిచ్చిన
నీ త్యాగమును మరచుట కు సాధ్యమా
నా తరమా యేసయ్య.
Il ప్రేమా ప్రేమా ll
***********************************************
Lyrics : Arigili Rajanna
Music : K.Y.Rathnam
Vocals : Anwesha