Nenemaiyunnano Song Lyrics | నేనేమైయున్నానో Song Lyrics | Telugu Christian New Year Songs Lyrics
ప:
నేనేమైయున్నానో అది దేవుని కృపవలనే
గత కాలమంతా కాపాడిన
నేనేమైయున్నానో అది దేవుని కృపవలనే
నూతన వత్సరమునకు నడిపించిన
అ. ప.
ఓ దేవా! నీవిచ్చిన రక్షణకై ఉత్సాహగానము చేసెదను
నా ప్రభువా నీ దీవెన కొరకై నిన్ను పాడి స్తుతించెదను
నా ప్రభువా నీవు చేసిన మేలులకై నిను పాడి స్తుతించెదను
1. అల్పుడనైన నన్ను అయోగ్యుడనైన
నన్ను నీ కృపతో రక్షించితివి
నా జీవితకాలమంతా అనేకులకు
దీవెనగా ఉండునట్లుగా దీవించుము
నీ ఆత్మతో నన్ను నింపుము
2. నీ సత్య సువార్తను ప్రకటించుటకై
నన్ను అభిషేకించుము నీ ఆత్మతో
దేవా నీ సాక్షిగా జీవించుటకై నన్ను
బలపరచి నడిపించుము
నీ సన్నిధిలో నన్ను నడుపుము
********************************************
Lyrics & Tune Composed - Rev. J. Devanand Kumar
Music - Ps. M. Param Jyothi
Vocals: Haricharan