Taramulu Yugamulu Song Lyrics | తరములు యుగములు Song Lyrics | Telugu Christian Songs Lyrics
పల్లవి
తరములు యుగములు గడిచినా.. చెరగని కథ ఇది తెలుసునా
తరగని మహిమల గురుతులే.. మెదులును కద ప్రతి మనసునా
శాప ధూపము కమ్మిన.. లోకమునే రక్షింపగా
పాప పంకిలమంటిన.. పుడమిని కడుగంగా
వెలసినదీ... ఆ దైవం
జనులకదే.. శుభ తరుణం
చరణం 1
ఎపుడు కననిది.. ఎవరు విననిది.. జగతి మురిసిన జన్మది
మమత కురిసిన.. సమత విరిసిన.. అమిత అరుదగు క్షణమది
పశువుల పాకలొ ప్రేమ జనియించెనే.. ఓ
అలసిన అవనికి ఆశ చిగురించెనే
నింగిన వింత తార మెరిసే.. నేలన కాంతి రేఖ వెలిగే
నవ్వులు పువ్వులల్లె పూసే.. బతుకున నందనాలు విరిసే (వెలసినదీ)
చరణం 2
మరపురానిది.. మరువలేనిది.. అమర చరితము యేసుది
మాటకందని.. మనసు నిండని.. మహిమ రూపము క్రీస్తుది
ఇలలో దైవం మనుజుడై మెలిగెనే.. ఓ
మమతల మధువులు పుడమిపై చిలికెనే
తనతో సంతసాలు వచ్చే.. తనకై సంబరాలు జరిగే
జనముల జీవితాలు మారే.. జన్మలు ధన్యమై మిగిలే (వెలసినదీ)
**********************************************
Lyricist : Sameera Nelapudi
Music : Jonah Samuel
Vocals : Nissy John