Papula Snehitudai Song Lyrics | పాపుల స్నేహితుడై Song Lyrics | Telugu Christian Songs Lyrics

పాపుల స్నేహితుడై బలహీనులకాశ్రయుడై
దేవుడే జన్మించె దీనుడై
ఉద్ధరించువాడై దాక్షిణ్యపూర్ణుడై
చెలికాడై మనతోడై అందాల బాలుడై
అ.ప. యూదాగోత్ర సింహము అతడే
అయినా గొర్రెపిల్లగా ధరణికొచ్చాడే
1. రక్షణిచ్చువాడై దోషాలు మరచు విభుడై
పరిశుద్ధత కలిగించు దేవుడై
పరలోకము చేర్చే అధికారముగల ఘనుడై
2. జ్ఞానమిచ్చువాడై ద్వారాలు తెరచు ప్రియుడై
ఎడబాయక నడిపించు దేవుడై
ప్రతి అక్కర తీర్చే మమకారముగల హితుడై
3. దీవెనిచ్చువాడై సంతోషపరచు వరుడై
అభివృద్ధిని జరిగించు దేవుడై
స్థితి స్థానము మార్చే సుగుణాలశీల ధనుడై