Akasha Veedhilo Oka Tara Song Lyrics | ఆకాశవీధిలో ఒక తార Song Lyrics | Telugu Christian Songs Lyrics
పల్లవి :
ఆకాశవీధిలో ఒక తార వెలిసింది
విలువైన కాంతులతో ఇల త్రోవ చూపింది
నశీధిరాత్రిలో నిజదేవుడు పుట్టాడని
నిత్యరాజ్యము చేర్చుటకై రక్షకుడుదయించాడని
జగమంతటా జయకేతనమైసాక్షిగ నిలిచింది
ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ
ఇక ఉత్సా హమే ఎంతో ఉల్లాసమే
మన బ్రతుకుల్లో నిండుగా "2"
"ఆకాశ వీధిలో"
1 చరణం :
పరిశుద్దాత్మతో జననం పవిత్రత నిదర్శనం
పరమాత్ము ని ఆగమనం పాపాత్ము ల విమోచనం "2"
తండ్రిచిత్తమును నెరవేర్చే తనయుడైపుట్టెను
తన పథములో మనల నడిపించేకాపరైవచ్చె ను "2"
ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ
ఇక ఉత్సా హమే ఎంతో ఉల్లాసమే
మన బ్రతుకుల్లో నిండుగా "2"
"ఆకాశ వీధిలో"
2 చరణం :
దివినేలే రారాజు దీనునిగా జన్మి ంచెను
దిశలన్ని చాటేలా శుభవార్తను ప్రకటింతుము "2"
చిరునవ్వు లు చిందించేశిశువైమదిమదినీ మీటెను
చిరు జ్యో తులు మనలో వెలిగించి చింతలే తీర్చెను "2"
ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ
ఇక ఉత్సా హమే ఎంతో ఉల్లాసమే
మన బ్రతుకుల్లో నిండుగా "2"
ఎంతో ఉత్సాహమే
*************************************
Lyrics & Tune : KISHORE BABU THAPPETA
Music: BRO KY RATNAM
Vocals: ANWESHA