Na Chelikadavu Neevayya Song Lyrics | నా చెలికాడవు నీవయ్యా Song Lyrics | Telugu Christian Songs Lyrics

పల్లవి:-నా చెలికాడవు నీవయ్యా..
నా నిజ స్నేహితుడా యేసయ్య
నా సహకారి వే నీవేగా
నా సంపదల గని వి నీవేనయ్యా (2)
ఎనలేని నీ ప్రేమను వర్ణింప తరమా
ఎనలేని నీ కృపను వివరింప తరమా (2)
యేసయ్యా ... యేసయ్యా..(2) (నా చెలికాడవు)
1. అంధకారమైన ఆగాథలైన కడగండ్లైన
కన్నీటి బాధలైన(2)
తాణ లేని వానిగా నేనుంటిని (2)
నన్ను విడిపించుటకు రావా యేసయ్యా
నన్ను రక్షించుటకు రావా యేసయ్యా(2) (నా చెలికాడవు)
2. ఎడారులైనా ఎండమావులైనా
పర్వతములైన కొండలోయలైనా(2)
తృష్ణ లేని వాని గా పడియుంటిని(2)
నన్ను తప్పించుటకు రావా యేసయ్య
నన్ను విడిపించుటకు రావాయేసయ్యా (2) (నా చెలికాడవు)
3. బలహీనత లైన నిందల శ్రమలైన
ఉపద్రవములైనా ఇబ్బంది కొలిమిలైన(2)
దిక్కులేనివానిగా నిలచి ఉంటిని (2)
నన్ను కాపాడుటకు రావా యేసయ్యా
నన్ను నిలబెట్టుటకు రావా యేసయ్యా (2)((నా చెలికాడవు)
**********************************************
Vocals: T. Suvartha Raju