Mana Raju Song Lyrics | ఇది ఆశ్చర్యకరుడు Song Lyrics | Telugu Christmas Song Lyrics

ఇది ఆశ్చర్యకరుడు జన్మించిన రోజు
ఆశ్చర్య కార్యములు జరిగించును నేడు
రారండి ప్రభువును ఆరాధింతుము
ఇది ఆలోచనకర్త అరుదెంచిన రోజు
ఆలోచనచెప్పి నడిపించును
రారండి నేడు ప్రభువును ఆరాధింతుము
ఇది బలవంతుడు భువికేతించిన రోజు
బలమైన కార్యములు జరిగించును నేడు
రారండి ప్రభువును ఆరాధింతుము
ఇది నిత్యుడగుతండ్రి ఏతెంచినరోజు
నిత్య జీవమును మనకిచ్చును నేడు
రారండి ప్రభువును ఆరాధింతుము
ఇది సమాధానకర్త ప్రభవించిన రోజు
శాంతి సమాధానము మనకిచ్చును నేడు
రారండి ప్రభువును ఆరాధింతుము
ఆరాధన ....
****************************************
Lyrics - Dasari Phinni Babu
Vocals - Sharon Philip
Tune - Tinnu Thereesh