Devadootha Christmas Song Lyrics | దేవదూత క్రిస్మసు Song Lyrics | Telugu Christmas Songs Lyrics
దేవదూత క్రిస్మసు....... దూత సేన క్రిస్మసు
గొల్లవారి క్రిస్మసు....... తూర్పుజ్ఞాని క్రిస్మసు
చిన్నవారి క్రిస్మసు....... పెద్దవారి క్రిస్మసు
పేద వారి క్రిస్మసు....... గొప్పవారి క్రిస్మసు
పల్లెయందు క్రిస్మసు....... పట్నమందు క్రిస్మసు
దేశమందు క్రిస్మసు....... లోకమంత క్రిస్మసు
క్రిస్మసన్న పండుగ........ చేసికొన్న మెండుగ
మానవాత్మ నిండుగ....... చేయకున్న దండుగ
క్రీస్తు దేవదానము......... దేవవాక్య ధ్యానము
క్రీస్తు శిష్యగానము.......... వీనికాత్మ స్థానము
కన్నవారి క్రిస్మసు........ విన్నవారి క్రిస్మసు
క్రైస్తవాళి క్రిస్మసు........ ఎల్లవారి క్రిస్మసు
పాపలోకమందున........ క్రీస్తు పుట్టినందున
పాపికెంతో మోక్షము........ ఈ సువార్త సాక్ష్యము
క్రీస్తే సర్వభూపతి........ నమ్మువారి సద్గతి
మేము చెప్పు సంగతి........ నమ్మకున్న దుర్గతి
******************************************
Vocals: Hanok Raj | Adbutha sisters
Lyrics: Bible Mission