Yacobu lo Nakshatramu Song Lyrics | యాకోబులో నక్షత్రము Song Lyrics | Telugu Christian Songs Lyrics

పల్లవి :
యాకోబులో నక్షత్రము ఉదయించును గగనాన
యూదాలో రక్షకుడు జన్మించిన భువిలోన
ఆడే పాడెదన్ నాట్యం చేసిదం
కంఠస్వరములతో యేసుని స్తుతించెదము
సంతోషమే సమాధానమే ఆనందమే సంబరమే
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్
1.దూతలు వచ్చిరి శుభవార్త చెప్పిరి
గొల్లలు వెళ్లి యేసును చూచిరి జ్ఞానులు వచ్చిరి
కానుకలు తెచ్చిరి యేసుకు అర్పించి ఆరాధించిరి
యేసుని జననంతో రక్షణ వచ్చెను
2.చీకటి పోయెను వెలుగు వచ్చును
పాప శాపము తొలగిపోయెను
అపవాది సంకెళ్లు విరిగిపోయేను
ప్రజలందరికీ విడుదల కలిగిను
యేసుని జననముతో సంతోషం వచ్చెను
3.వ్యాధి బాధ నుండి స్వస్థత కలిగి ను
దుఃఖ దినములు సమాప్తం ఆయెను
కన్నీరంతా నాట్యంగా మారెను
నలిగిన వారికి నెమ్మది వచ్చును
యేసుని జననముతో నిత్యజీవం వచ్చెను
************************************************
Lyrics,Tune & Producer: Rev K Emmanuel
Music: T. John vinil
Singer: Bro. Joshuva Gariki