Vinnara O Annaralara Song Lyrics | విన్నారా ఓ అన్నలారా Song Lyrics | Telugu Christian Songs Lyrics
విన్నారా ఓ అన్నలారా దూత చెప్పే ముచ్చట
కన్నారా మీ కన్నులారా పరలోక వెలుగచ్చట
కోరిన వరములు ఇచ్చే సామి కొలువు తీరి ఉన్నాడంట
ఆయన పదములు పట్టినవారికి రక్షణ కలిగిస్తాడంట
1. జనులందరికీ మహా సంతోషపు వార్తంట
లోకానికే ఇది సంబరపు దినమంట
దావీదు పట్టణమునకే ధన్యత వచ్చెనంట
పామరులమైన మనకే దరిశనమిచ్చెనంట
2 . ఇన్నాళ్ళు కన్న కలలు ఈనాడు పండెనంట
మెస్సీయ చిన్న శిశువై తొట్టిలో పరుండెనంట
పొత్తిగుడ్డలే తనకు మెత్తని పరుపాయెనంట
పశులపాకయే చివరకు రాజగృహమాయెనంట
*******************************************
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson