Prabhu Nee Vaadanu Song Lyrics | ప్రభూ నీ వాడను Song Lyrics | Telugu Christian Songs Lyrics
ప్రభూ నీ వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును
మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను
1. ప్రభువా యెరిగితిని లోకమంత మోసమని
చూపితివి సమాధాన నిరీక్షణ నా కిలలో
కృతజ్ఞత కలిగి (2) - నీవైపే చూచెదను
నీయందే నిలిచి యుండి నీయాజ్ఞల పాలింతును
|| ప్రభూ ||
2. నా ముందు నడిచే ప్రభూ నిన్ను వెంబడించెదను
నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును
నెమ్మదిని పొంది యిల (2) కన్నీరు - కార్చనిక
నీవే నా సర్వమని నీయందే బలపడెద
|| ప్రభూ ||
3. యేసుని సిలువజూచి విజయమును పొందెదను
సహింతును సంతసముగ నీ కొరకు అన్నింటిని
నిన్ను నే నమ్మెదను (2) - నీతోనే సాగెదను
నీ రెక్కలచాటు నేనుండ భయపడను
|| ప్రభూ ||
4. మరణనది యొద్దకు సంతసముగ వచ్చెదను
మృత్యువు బారినుండి జీవమునకు దాటింతువు
రక్షకుని చూఛెదను (2) - నన్నాయన చేర్చుకొనున్
తక్షణమే తన రూపమునకు మార్పుచెందెదను
|| ప్రభూ ||
5. అగమ్య జ్యోతియందు ఘనముగ నే ప్రవేశించి
దూతలు, పరిశుద్ధులు, భక్తులనే చూచెదను
నే సంతసించెదను (2) - ప్రభువుతోడ నుండెదను
నిరీక్షణ యిదియే ఆయనతో నేనుందును
********************************************
Hebron Songs Lyrics
Songs of Zion