-->
Type Here to Get Search Results !

Divilo Veduka Song Lyrics | దివిలో వేడుక Song Lyrics

Divilo Veduka Song Lyrics | దివిలో వేడుక Song Lyrics | Telugu Christmas Song Lyrics

Divilo Veduka

దివిలో వేడుక - ఊరంతా పండుగ - నేడే రారాజు పుట్టెనే

ఇలలో జాడగా - ఆ నింగీ తారక - వెలిసే ఈ వింత చూపగా


మహా సంతోషమే - ఆహా ఆనందమే

ఆహా ఈ రేయిలో - ఓహో ఉల్లాసమే


ఇల మెస్సయ్య - జన్మించినాడుగా

మన యేసయ్య - ఉదయించినాడుగా


మహారాజు - మన యేసు

నిన్నే కోరీ - ఇలా వచ్చెనే

జగాలేలే - మన యేసు

నిన్నే చేర - దిగి వచ్చెనే


1. దేవ దేవుడే - మరియ తనయుడై

ధరలో దీనుడై - పుట్టే పుణ్యుడై


పరిశుద్ధాత్ముడే - పాపరహితుడై

ప్రేమపూర్ణుడే - పరమ జీవమై


లోకాన్ని వెలిగించ వచ్చాడుగా

నిను దీవించి తన ప్రేమ చూపాడుగా


దారే చూపంగ దేవుడే

దయతో దీపంగ నిలిచెనే


2. ఆడే గొల్లలు - పాడే దూతలు

వచ్చిరి జ్ఞానులు - వేడిరి యేసుని


ఆ పశుపాకలో - పొంగే సంబరం

మనకు రక్షణై - యేసు ఈ దినం


పాపాన్ని తొలగించ వచ్చాడుగా

నిను కరుణించి తన జాలి చూపాడుగా


కృపతో కాపాడ వచ్చెనే

చెలిమై చల్లంగ చూసెనే


Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area