Adharamu Na Adharamu Song Lyrics | ఆధారము నా ఆధారము Song Lyrics | Telugu Christian Songs Lyrics
ఆధారము నా ఆధారము
నాకున్న ఆధారము
నీవేలే యేసయ్యా..ఆ.
నీవేలే యేసయ్యా.."2" "ఆధారము"
1. ఒక్కమాట చేత ఈ భూమినీ
ఒక్కమాట చేత ఆ నింగినీ "2"
సర్వము సృష్ఠించిన నీవుండగా -2-
భయమేల నాకు నా యేసయ్యా -2-
"ఆధారము"
2. నా అన్నవారే వదిలేసినా
అయినవారు అందరు ద్వేషించినా "2"
నా కష్టకాలమందు నీవుండగా -2-
దిగులేల నాకు నా యేసయ్యా -2-
"ఆధారము"
3.నీలో నేను జీవించగా కృపచూపుము
నీకై నేను జీవించగా దయచూపుము "2"
కృపానిధి నీవేలే నా యేసయ్యా -2-
నీ కృపలో నన్ను పెంచుము యేసయ్యా-
నీకృపలో నన్నునడిపించుముయేసయ్యా.
"ఆధారము"