-->
Type Here to Get Search Results !

Nisi Raathri Sudigalilo Song Lyrics | నిశిరాత్రి సుడిగాలిలో Song Lyrics | Telugu Christian Songs Lyrics

Nisi Raathri Sudigalilo Song Lyrics | నిశిరాత్రి సుడిగాలిలో Song Lyrics | Telugu Christian Songs Lyrics

Nisi raathri Sudigalilo
నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని
ఊపిరితో మిగిలెదనా ఉదయానికి
తడవు చేయక యేసు నను చేరుకో
నా ప్రక్కనే ఉండి నను పట్టుకో..
భయముండగలదా నీవున్నచో
నీ కన్నులు నామీద నిలిచుండగా
నా చేయి నీ చేతిలో ఉండగా (నిశిరాత్రి)

ఈ చీకటి సమయం నిలిచెను నా ఈ పయనం
కనిపించక దారులు మొదలాయె కలవరము
వీచే ఈ గాలులలో నే కొట్టుకుపోకుండా
తప్పించెదవని దేవా ఆశతో నే వేచితిని
నీవు గాక నాకిపుడు దిక్కెవ్వరు (నిశిరాత్రి)

నే చేసిన వాగ్ధానము లెన్నో ఉన్నాయి
నెరవేర్చు బాధ్యతలు ఇంకా మిగిలాయి
ఈ రేయి ఈ చోటే నేనాగి పోవలదు
రాతిరి గడిచేవరకు నీ చాటున నను దాచి
ఉదయమును చూపించుము నా కంటికి

అల్పము ఈ జీవితమని నేనెరిగితిని
కనురెప్పపాటున ఆవిరికాగలదు
అనుదినమిక నీ కృపనే నే కోరుచు
పయనింతును నా గురివైపు నిను ఆనుకుని
భయముండగలదా నీవున్నచో
నీ కన్నులు నామీద నిలిచుండగా
నా చేయి నీ చేతిలో ఉండగా

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area