Maate Chalayya Yesayya Song Lyrics | మాటే చాలయ్యా యేసయ్య Song Lyrics | Christian Songs Lyrics in Telugu
మాటే చాలయ్యా యేసయ్య నీ మనసే చాలయ్యా యేసయ్యా
మనసారా నిను పాడా
మదినిండా నిను వేడ
నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధనా
మనసంతా నీ కోసం ఈ ఆలాపనా
లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నను వేధించగా
మరణమే వరమై వరమే వశమై అలుసై నలుసై నను వేధించగా - 2
ధిక్కు లేని వాడను ధరికి నిలిచి
దారి లేని వాడను మార్గమై నిలచి
నను ప్రేమతో పిలచి నావయ్యా
నా పాప శాపంబాపినవయ్యా - 2
దయగల దేవ నా దీపమును
వెలిగించితివా ఈ చీకటిలో
పారవేయకుండా త్రోసి వేయకుండా విడిపించితివా
బంధకాలలో నా కాల గతులలో
నీ కృప నాపై విస్తరింప చేసావు
విడుదల నిచ్చి నను ప్రేమతో పిలిచి నావయ్యా
నా పాపమంత బాపినవయ్యా
మనసారా నిను పాడా
మదినిండా నిను వేడ
నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధనా
మనసంతా నీ కోసం ఈ ఆలాపనా
లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నను వేధించగా
మరణమే వరమై వరమే వశమై అలుసై నలుసై నను వేధించగా - 2
ధిక్కు లేని వాడను ధరికి నిలిచి
దారి లేని వాడను మార్గమై నిలచి
నను ప్రేమతో పిలచి నావయ్యా
నా పాప శాపంబాపినవయ్యా - 2
దయగల దేవ నా దీపమును
వెలిగించితివా ఈ చీకటిలో
పారవేయకుండా త్రోసి వేయకుండా విడిపించితివా
బంధకాలలో నా కాల గతులలో
నీ కృప నాపై విస్తరింప చేసావు
విడుదల నిచ్చి నను ప్రేమతో పిలిచి నావయ్యా
నా పాపమంత బాపినవయ్యా