Type Here to Get Search Results !

Amara Premukuda Song Lyrics | ఆరాధ్యుడా ఆదిసంభూతుడా Song Lyrics | Telugu Christian Lyrics

Amara Premukuda Song Lyrics | ఆరాధ్యుడా ఆదిసంభూతుడా Song Lyrics | Telugu Christian Lyrics

Amara Premukuda
ఆరాధ్యుడా - ఆదిసంభూతుడా
అక్షయుడా - అతికాంక్షణీయుడా (2)
శతకోటి స్తోత్రార్హుడా - వర్ణింపనాశక్యుడా (2)

ఘనుడా - నా ప్రియుడా
నాయకుడా - నావికుడా (2)
ప్రాణ స్నేహితుడా....
నా హృదయకాంక్షితుడా.. (2)

1.ధవళవర్ణుడా - రత్నవర్ణుడా
పదివేలలోన అతి సుందరుడా (2)
శ్రేష్ఠ గుణశీలుడా...
సర్వకృపాధారుడా... (2) ||ఘనుడా||

2.స్తుతికి పాత్రుడా - ఘనతకర్హుడా
వేల్పులలోన పరిశుద్ధ దేవుడా (2)
అత్యంత బలవంతుడా..
అమర ప్రేమికుడా... (2) ||ఘనుడా||

3.హృదయ పాలకుడా - సర్వవీక్షకుడా
జగములలోన ఉన్నవాడవనువాడ (2)
నా విమోచకుడా...
నా నిత్య పోషకుడా.. (2) ||ఘానుడా||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area