Type Here to Get Search Results !

Na Ashalanni Teerchi Song Lyrics | నా ఆశలన్ని తీర్చి Song Lyrics | Telugu Christian Lyrics

Na Ashalanni Teerchi Song Lyrics | నా ఆశలన్ని తీర్చి Song Lyrics | Telugu Christian Lyrics

Na Ashalanni Teerchi
పల్లవి : నా ఆశలన్ని తీర్చి - ఆదుకొన్న యేసయ్యా
ఆనుకున్న వేళలో - ఆదరించినావయ్యా
నీవు ఎల్లవేళలందున నాకు ఆధారమైనావయ్యా (2)

అ.పల్లవి: ఆశతీర నిన్నే ఆరాధింతును
నా బ్రతుకు కాలమంతా ప్రభువా
స్తుతియింతును (2)

1. బ్రతుకుట భారమై - చితికిన వేళలో
చేరదీయువారు లేక - చింతించు సమయములో (2)
ఆగిపోక నేను సాగాలని - ఆశతో అడుగగా అభిషేకాన్ని
సంద్రాన్ని రహదారిగా చేసినట్లుగా - అవరోధములను తొలగించినావుగా
ఆశతీర నిన్నే ఆరాధింతును

అ.పల్లవి: ఆశతీర నిన్నే ఆరాధింతును
నా బ్రతుకు కాలమంతా ప్రభువా
స్తుతియింతును (2)

2. శ్రమలతో నలిగి - విసిగిన వేళలో
ధైర్యపరచువారు లేక - దుఃఖించు సమయములో (2)
భయపడక నీలో నిలవాలని - ఆశతో అడుగగా ధైర్యాన్ని
తుఫానును మాటతో అణిచినట్లుగా - శోధనలన్నియు
తొలగించినావుగా

అ.పల్లవి: ఆశతీర నిన్నే ఆరాధింతును
నా బ్రతుకు కాలమంతా ప్రభువా
స్తుతియింతును (2)

3. అయినవారే విడిచి - ఒంటరైన వేళలో
తోడుండువారు లేక - కృంగియున్న సమయములో (2)
ఓర్పును కలిగి బ్రతకాలని - ఆశతో అడుగగా సహవాసాన్ని
మారాను మధురముగా మార్చినట్లుగా - అవమానములను తొలగించినావుగా

అ.పల్లవి: ఆశతీర నిన్నే ఆరాధింతును
నా బ్రతుకు కాలమంతా ప్రభువా
స్తుతియింతును (2)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area