Type Here to Get Search Results !

Emunnadi Nalo Song Lyrics | ఏమున్నది నాలో Song Lyrics | Telugu Christian Lyrics

Emunnadi Nalo Song Lyrics | ఏమున్నది నాలో Song Lyrics | Telugu Christian Lyrics

Emunnadi Nalo
ప: ఏమున్నది నాలో ఓ యేసయ్య
మచ్చుకైన మంచి కానరాదయ్యా // 2//
ఎంతవెదకి చూచినా పాపమే గదయ్యా // 2 //
ఎందుకయ్య నాపై - నీకింత ప్రేమయ్యా

అప: యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... నిత్యజీవ మార్గమా
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... పరలోక ద్వారమా // ఏమున్నది //

చ1: నినుచూడ సాధ్యమేనా తేజోమయ
కరుణించి ననుచేరే నీదయ
వెలువడగా నీవాక్యం కనబడె నాపాపం
తడబడిన నా పాదం స్థిరపడె నీకోసం
క్షమియించి ఇచ్చావయ్యా నీకృపాక్షేమము
నన్నావరించెనయ్యా నీదువాత్సల్యము
తనివితీరా అనుక్షణం నిన్నారాధింతును
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... నిత్యజీవ మార్గమా
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... పరలోక ద్వారమా // ఏమున్నది //

చ2: నీపైనే తిరుగుబాటు చేసానయ్యా
తాలిమితో మన్నించే నీ దయ
శ్రమపడగా నీదేహం సరియాయెను సర్వం
కార్చితివి నీరుధిరం దొరికెను పరిహారం
నే తీర్చజాలనయ్యా నీ ఋణమే మాత్రము
సాక్షిగా నిలుతునయ్యా నా జీవితాంతము
తనివితీరా అనుక్షణం నిన్నారాధింతును
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... నిత్యజీవ మార్గమా
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... పరలోక ద్వారమా // ఏమున్నది //

చ3: నిను వీడి పారిపోతి ప్రేమామయ
విడువకయే నను వెదకే నీ దయ
వినబడగా నీ స్వరం పులకించెను దేహం
తెంచితివి బంధకం కలిగెను స్వాతంత్ర్యం
క్షణమైన విడువనయ్యా నీ సన్నిధానము
వివరింప జాలనయ్యా ఈ గొప్ప భాగ్యము
తనివితీరా అనుక్షణం నిన్నారాధింతును
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... నిత్యజీవమా
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... పరలోక ద్వారమా // ఏమున్నది //

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area