Type Here to Get Search Results !

Ennikaloni Vadavega Song Lyrics | ఎన్నికలోని వాడవెగా Song Lyrics | Telugu Christian Lyrics

Ennikaloni Vadavega Song Lyrics | ఎన్నికలోని వాడవెగా Song Lyrics | Telugu Christian Lyrics

Ennikaloni Vadavega
పల్లవి:
ఎన్నికలోని వాడవెగా గతములోనె నీవు -
యెనలేని దీవెనలు పొందగ నేడు పిలువబడినావు-2

అ.పల్లవి:
భయపడుమా యువజనమా- నీ జీవితము దేవుని దానము
తలచుట మరువకుమా- నీ బ్రతుకంత దేవుని భయము కలిగిన మేలు సుమా-2

చరణం1:
ఇవ్వబడిన సమయము సరిగా వినియోగించుము
అజ్ఞానివి కాబోకుము చీకటిమయమైపోకుము-2
జ్ఞాన సంపదను పొందగ దైవ భయము కలిగుండుము-2
బ్రతుకువెలుగుతో నింపుము
॥భయపడుమా॥

చరణం2:
విలువైనది ఈ ప్రాయము బలమైన పనులు చేయుము
ప్రభువునామ మహిమార్థమై నీ దినములు వెచ్చించుము-2
నాట బడిన నీ స్థలములో ప్రభువు కొరకు ఫలియించుము-2
తల కృపకు కీర్తి కలిగించుము
॥భయపడుమా॥

చరణం3:
లోకములోని మోసము నీ లోపల చేర్చుటకోసము
శోధకుడుండెను చూడుము నీపై దాడి చేయును-2
ఆజ్ఞలన్ని మరిపించుచు పాపము నీపై మోపును -2
పతనమునకు పడద్రోయును
॥భయపడుమా॥

Music: Dr. J K Christopher
Vocals: Bro. Philip
Lyricist & Tune : Rev. K Kishore Kumar

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area