Type Here to Get Search Results !

Kondalatho Cheppumu Song Lyrics | కొండలతో చెప్పుము Song Lyrics | Telugu Christian Lyrics

Kondalatho Cheppumu Song Lyrics | కొండలతో చెప్పుము Song Lyrics | Telugu Christian Lyrics

Kondalatho Cheppumu
ప॥ కొండలతో చెప్పుము కదిలిపోవాలనీ
బండలతో మాట్లాడుము కరిగిపోవాలనీ "2"
నమ్ముట నీవలనైతే హే
సమస్తం సాధ్యమే "3"
మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు
మనసులో సందేహించక మాట్లాడు
మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు
యేసుని నామములోనే మాట్లాడు "కొండలతో"

1. యేసయ్యా ఉన్న దోనెపైన తుఫాను కొట్టెనే
యేసయ్యా దోనె అమరమున నిద్రించుచుంండెనే
గాలిపైకి లేచి అలలు ఎంతో ఎగసి దోనెలోనికొచ్చెను జలములు జోరున
శిష్యులేమో జడిసి వానలోన తడిసి బహుగా అలసిపోయే
ప్రభువా ప్రభువా లేవవా త్వరగా మేము నశించిపోతున్నామని
ప్రభువుని లేపిరి తమలో ఉంచిన దైవశక్తి మరచి
రక్షకుడు పైకి లేచాడు శిష్యులకు చేసి చూపాడు
పరిస్థితులతో మాటలాడాడు
ఆ గాలినేమో గద్దించి తుఫాన్ని ఆపేసి నిమ్మలపరిచాడు
శిష్యులను తేరి చూచాడు విశ్వాసం ఎక్కడన్నాడు
అధికారం వాడమన్నాడు
ఇక మనమంతా ప్రభులాగా చేసేసి గెలిచేసి ప్రభునే స్తుతిద్దాము
జై జై జై జై జై జై జై జై ఈశు మసీకి జై
యేసుకే జై జై జై ప్రభువుకే జై జై జై "మాట్లాడు"

2. పరలోక రాజ్య తాళాలు మనచేతికిచ్చెనే
పాతాళలోక ద్వారాలు నిలువనేరవనెనే
కన్నులెత్తి చూడు తెల్లవారే పైరు కోతకొచ్చి నిలిచెను మనకై నేడు
వాక్యముతో కదిలించిన చాలు కోత పండగేలే
కాపరిలేని గొర్రెలు వారని కనికరపడెను ప్రభువు నాడు
క్రీస్తుని కనులతో చూద్దామా తప్పిపోయిన ప్రజను
ప్రభులాగా వారిని ప్రేమిద్దాం సాతాను క్రియలు బంధిద్దాం
విశ్వాస వాక్కు పలికేద్దాం
ఇక ఆ తండ్రి చిత్తాన్ని యేసయ్యాతో కలిసి సంపూర్తి చేద్దాం
పరలోకరాజ్య ప్రతినీధులం తాళాలు ఇంక తెరిచేద్దాం
ఆత్మలనులోనికి నడిపిద్దాం
ఇక సంఘంగా ఏకంగా వాడేద్దాం అందంగా ఈశు మసీకి జై
జై జై జై జై జై జై జై జై ఈశు మసీకి జై
యేసుకే జై జై జై ప్రభువుకే జై జై జై

మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు
మనసులో సందేహించక మాట్లాడు
మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు
యేసుని నామములోనే మాట్లాడు
కొండలతో చెప్పుము కదిలిపోవాలనీ
బండలతో మాట్లాడుము కరిగిపోవాలనీ
నమ్ముట నీవలనైతే హే
సమస్తం సాధ్యమే "6"

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area