Nanu Deevinchaavu Song Lyrics | ఎన్నెనో మేలులతో Song Lyrics | Telugu Christian Lyrics
ఎన్నెనో మేలులతో నను దీవించావు
నా జీవితకాలమంత యెరిగి ఉన్నావు
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను
ఎన్ని రీతులుగా కీర్తించగలను
వందనాలు యేసయ్య నీకే
శతకోటి స్తోత్రలయ్యా నీకే || 2 || || ఎన్నెనో మేలులతో ||
కష్టాల మార్గములో అలసిన పయణములో
నిందలు మోయలేక కృంగిన సమయములో || 2 ||
సంపూర్ణముగా నాకు పరిశుద్దతనిచ్చావు
సమాధాన కర్తవు నీవై నన్ను ఆదరించావు || 2 || || వందనాలు ||
ఏ గమ్యము ఎరుగని నా జీవిత యాత్రలో
అలజడి అలలెన్నో చెలరేగెను నా మదిలో || 2 ||
కలవరమును కరిగించి, కరుణను కురిపించావు
నా భయమును గద్దించి, నీ శాంతితో నింపావు || 2 || || వందనాలు ||
కలిగేటి శోధనలు, కనపడని మార్గములు
నీ వాక్యమే దీపముగా, సాగెను నా పాదములు || 2 ||
అపవాదిని నా చేత, ఓడింప జేసావు
వాగ్దాన పూర్ణుడిగా జయ జీవిత మిచ్చావు || 2 || || వందనాలు ||