Kaalamu Swalpakaalamu Song Lyrics | కాలము స్వల్పకాలము Song Lyrics
కాలము స్వల్పకాలము..
కదిపి చూడు అది కఠినమైనది
సమయము సర్వకాయమూ..
తడిమి చూడు అది కరకుగుంటది
ఎదురుగున్నాదెవ్వరైనా
తలను ఎన్నడూ వంచనంటది
ఎప్పుడైనా.. ఎక్కడైనా.. తిరిగి చూడని పయనమే తనది.
కాలమన్న వాహనం.. ఆగనన్నది
వెనక తిరిగి చూసేదే.. లేదనన్నది
బ్రతిమిలాడదామన్నా.. కుదరదంటది
ఎటులనైన తనతోనే.. కదలమంటది
మాట వినదు కాసేపైనా.. చెవులు మూసుకుంటుంది
స్థితిని కనదు ఏదేమైనా.. చితికి కూడా చలియించదది.
మొండిదా.. గుండె లేనిదా..
కంటనీరు చూసినా కరగనంటదది..
సృష్టికర్త చేతులలో వాడబడతది
ఇవ్వబడిన పనులన్నీ చక్కబెడతది
తనకు ఉన్న నియమాల్నే.. మీరనంటది
ఘనతనొందు దేవునికే లోబడుంటది
మనము మేలుకొని జీవిస్తే.. అమృతాన్ని అంటుంది
గాఢనిద్రలో మునిగుంటే.. గరళమల్లె కాటేస్తుందది
నరకమా.. నిత్యజీవమా.. సత్యవాక్కుతో భువిని.. హెచ్చరిస్తుంది..
ముప్పది మూడున్నర యేళ్ళే ప్రభువుకున్నది
భువిని మార్చే పనిభారం ఎదుటనున్నది
ప్రభుని బ్రతుకు చూసాకా.. సమయమనేది
తనను మనకు మాదిరిగా చూపుతున్నది
క్రీస్తు ప్రభువులా పనిచేసి.. పరము చేరమంటుంది
ఆశ ఉంటె సరిపోదంటూ.. ఆచరించమని చెబుతుంది
జ్ఞానిలా.. అన్నివేళలా..
ఆత్మపూర్ణులై వెలుగు పంచమంటుంది..