Type Here to Get Search Results !

Israyeliyula Devunde Song Lyrics | ఇశ్రాయేలీయుల దేవుండే Song Lyrics | Andhra Kraistava Keerthanalu

Israyeliyula Devunde Song Lyrics | ఇశ్రాయేలీయుల దేవుండే Song Lyrics | Andhra Kraistava Keerthanalu

Israyeliyula Devunde  Song Lyrics
ఇశ్రాయేలీయుల దేవుండే – యెంతో స్తుతి నొందును గాక
యాశ్రితువౌ తన జనులకు దర్శన – మాత్మ విమోచన కలిగించె ॥నిశ్రా॥

తన దాసుఁడు దావీదు గృహంబున – ఘన రక్షణ శృంగము
నిచ్చె = మన శత్రువు లగు ద్వేషులనుండియు – మనలన్
బాపి రక్షణ నిచ్చె ॥నిశ్రా॥

దీనిని గూర్చి ప్రవక్తల నోట – దేవుఁడు పలికించెను దొల్లి
మానవ మన పితరులఁ గరుణింపఁగ – మహిలోన నిబంధనఁ జేసె ॥నిశ్రా॥

జనకుం దగు నబ్రాహాముతోఁ – జేసిన యా ప్రమాణముఁ దలఁచి
మనము విరోధులనుండి విమోచన – గని నిర్భయులమై మెలఁగ ॥నిశ్రా॥

ఆయన సన్నిధానమునందు – నతి శుద్ధిగ నీతిగ నుండఁ
పాయక తన సేవను నిత్యంబును – జేయఁగ నీ రక్షణ నిచ్చె ॥నిశ్రా॥

ధర నో శిశువా దేవుని దీర్ఘ – దర్శి వనెడు పేరొందెదవు
పరమేశ్వరుని వాత్సల్యతతోఁ = పాపవిముక్తిఁ బ్రజ లొంద ॥నిశ్రా॥

మానుగ రక్షణ జ్ఞాన మొసంగఁగ – మార్గము సిద్ధపరచుటకై
దీన మనస్సుతోఁ బ్రభునకు ముందు – గా నడిచెదవు భయభక్తి ॥నిశ్రా॥

మరియును సమాధాన సరణిలో – మన మిఁక నడువఁ జీఁకటిలో
మరణచ్ఛాయలో నుండిన వారికి – నరుణోదయ దర్శన మిచ్చె ॥నిశ్రా॥

జనక పుత్రాత్మ దేవుని కిలలో – ఘనత మహిమ కల్గును గాక
మును పిపు డెప్పుడు తనరి నట్లు యుగ – ములకును దనరారునుగా కామేన్ ॥నిశ్రా॥

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area