Type Here to Get Search Results !

Yudula Raju ga Song Lyrics | యూదుల రాజుగ Song Lyrics | Telugu Christmas Song Lyrics

Yudula Raju ga Song Lyrics | యూదుల రాజుగ Song Lyrics | Telugu Christmas Song Lyrics

Yudula Raju ga Song Lyrics
పల్లవి:
యూదుల రాజుగ పుట్టినవానిని - చూతము రారండి
పాపుల రక్షకుడేసు ప్రభువని - చాటగ రారండి

ప్రవక్తలు అందరూ - ప్రవచించిన రక్షకుని
ఆదికంటే ముందు ఉన్న - వాక్యమైన దేవుని

ఆ.ప..కళ్ళారా - కళ్ళారా
కళ్ళారా మనమందరము - చూచితరించను
ఇమ్మానుయేలుగా - అవతరించెను
Happy Christmas - Merry Christmas

చరణం 1:
వంకర త్రోవలు - తిన్నగ చేయును
ఎత్తు పల్లాలను - సమముగ చేయును
చీకటి బ్రతుకుల్లో - వెలుగును నింపును
హితవత్సరమును - యిల ప్రకటించును

మతము దేనిని - చేయకపోయెను
యేసు దానిని - చేసెను
వ్రతముల వల్ల కాని కార్యము
శిలువ యాగములో - నెరవేర్చెను

ఆ.ప..కళ్ళారా - కళ్ళారా
కళ్ళారా మనమందరము - చూచితరించను
ఇమ్మానుయేలుగా - అవతరించెను
Happy Christmas - Merry Christmas


చరణం 2:
బంగరు బోళము - సాంబ్రాణి తెచ్చి
ముగ్గురు జ్ఞానులు - ఆరాధించిరి
యేసును చూచిన వెంటనే జ్ఞానులు
పాత మార్గమునుండి - మళ్లించబడిరి

క్రిస్మస్ అంటే - సందడి కాదు
దైవ సందర్శనని ఎరుగు

ఇళ్లు గుళ్ళు - వెలుగుటకంటే
మదినిండాలి - యేసుని వెలుగు

ఆ.ప..కళ్ళారా - కళ్ళారా
కళ్ళారా మనమందరము - చూచితరించను
ఇమ్మానుయేలుగా - అవతరించెను
Happy Christmas - Merry Christmas.

రచన, స్వరకల్పన, గానం
సాహిత్య రత్న
Dr. ఆకుమర్తి డేనియల్
సంగీతం : ప్రశాంత్ పెనుమాక

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area