Type Here to Get Search Results !

Sthuthula Pallaki Song Lyrics | స్తుతుల పల్లకి సర్వేసునికీ Song Lyrics | New Telugu Christmas Song Lyrics

Sthuthula Pallaki Song Lyrics | స్తుతుల పల్లకి సర్వేసునికీ Song Lyrics | New Telugu Christmas Song Lyrics

 Sthuthula Pallaki  Song Lyrics
పల్లవి:
స్తుతుల పల్లకి సర్వేసునికీ
చలిరాతిరి స్వాగతించే బాలయేసుకి
రక్షణ పల్లకి ఈ జగానికీ
తరతరాలు నశియించే మానవాళికి

పడమరాన సూర్యుడల్లె ఉదయించగా
బాలయేసు జాబిలల్లే ముద్దులొలకగా
మరియతల్లి కానుకల్లె జగతికివ్వగా
అణగారిన బ్రతుకుల్లో వెలుగునివ్వగా//2//

పండెనంట కలలు సంబరాలు మొదలు
లోకమంతా కొలిచే క్రిస్మసు ఉత్సవాలు
కమ్మిన చీకటి సాతాను బంధకాలు
బల్లున తెగతెంచే బానిస సంకెళ్లూ
(స్తుతుల పల్లకి)
చరణం 1:
తూర్పుదేశ జ్ఞానులంత వెతుకుచుండగా
ఆకాశమందు తారఒకటి దారిచూపగా
ప్రవచనాలు నెరవేర్పుకు సిద్దమవ్వగా
చరిత్రను తిరగరాసే శకపురుషునిగా

తొట్టిలోన యేసును కళ్లారచూడగా
జనులంత గుమ్మికూడి నాట్యమాడగా
భువిలోన మురిసారు జనులు మెండుగా
లోకమంత జరుపుకొనిరి పెద్దపండుగా

తంబూర నాదం గొల్లలప్రతి గానం
నీతిని నెలకొల్పే విశ్వశాంతి అర్చనం
తైలపు తలస్నానం సాంబ్రాణి బోళం
కష్టాలను తీర్చే యేసునాధ దర్శనం
(స్తుతుల పల్లకి)
చరణం 2 :
ప్రభుయేసు క్రియలన్ని జనులుచూడగా
నిత్యజీవ మార్గమని సత్యమెరుగగా
యేసుక్రీస్తు వెంబడీ జనులునడువగా
భూలోకపు రాజులంత వణికినారుగా

సైన్యమే స్థాపించని రాజాదిరాజుగా
తానే ఒక సైన్యమై ఉద్బవించెగా
శాస్త్రులు పరిసయ్యులే విస్మమొందగా
ధర్మశాస్త్ర వివరణకూ జడిసినారుగా

యేసుని జననం పాపరోగ హరణం
హృదిన్ని శుద్ధిచేసే పరలోక ఔషధం
పరమతండ్రి కోసం కలిగెను మహరోషం
తానేఒకమార్గమై చూపెను మహలోకం
(స్తుతుల పల్లకి)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area