Nuthanaparachumu Mamu Nadipinchumu Song Lyrics | నూతనపరచుము మము Song Lyrics
నూతనపరచుము మము నడిపించుము
వాడబారని నీ కృపలో
మము పిలచినది ఇల నిలచునది
నీ కృపయేగా మా దేవా
నీ కృపయేగా ఉత్తమము నీ కృపయేగా శాశ్వతము
నీ కృపయేగా మా దేవా
సొంతవారి ద్రోహమే గుంతలోకి నెట్టినా
నీతికి ప్రతిగా మేటి శ్రమ పుట్టినా
ఒంటరి యోసేపుతో జంటగ నడచినది
కంటక స్థితినంత అడుగంట మాపినది
నీ కృపయేగా మా దేవా
కన్నవారి ధోరణే అడవిలోకి నెట్టినా
మేలుకు ప్రతిగా కీడు వెంబడించినా
కాపరి దావీదును రాజుగ కోరినది
సంకటమంత బాపి కడు దీవించినది
నీ కృపయేగా మా దేవా
గడచిన కాలమే కలవర పెట్టినా
తలచిన రీతిగా సాగలేక పోయినా
తదుపరి వత్సరము మేము కోరునది
మా బ్రతుకంతా కావలసినది
నీ కృపయేగా మా దేవా
వాడబారని నీ కృపలో
మము పిలచినది ఇల నిలచునది
నీ కృపయేగా మా దేవా
నీ కృపయేగా ఉత్తమము నీ కృపయేగా శాశ్వతము
నీ కృపయేగా మా దేవా
సొంతవారి ద్రోహమే గుంతలోకి నెట్టినా
నీతికి ప్రతిగా మేటి శ్రమ పుట్టినా
ఒంటరి యోసేపుతో జంటగ నడచినది
కంటక స్థితినంత అడుగంట మాపినది
నీ కృపయేగా మా దేవా
కన్నవారి ధోరణే అడవిలోకి నెట్టినా
మేలుకు ప్రతిగా కీడు వెంబడించినా
కాపరి దావీదును రాజుగ కోరినది
సంకటమంత బాపి కడు దీవించినది
నీ కృపయేగా మా దేవా
గడచిన కాలమే కలవర పెట్టినా
తలచిన రీతిగా సాగలేక పోయినా
తదుపరి వత్సరము మేము కోరునది
మా బ్రతుకంతా కావలసినది
నీ కృపయేగా మా దేవా