Type Here to Get Search Results !

Na Manase Mandasamu Song Lyrics | నా మనసే మందసము Song Lyrics | Latest Telugu Christian Songs Lyrics

Na Manase Mandasamu Song Lyrics | నా మనసే మందసము Song Lyrics | Latest Telugu Christian Songs Lyrics

Na Manase Mandasamu Song Lyrics
నా మనసే మందసము ... || నా మనసే ||
నా దేహం దేవాలయము...
నీ ఆజ్ఞను మోసె పల్లకిని నేను...
నీ నీతిని నానుండి వ్యాపింపచేసెదను
నా తండ్రి యెహోవా... నా ప్రభువా దేవా
నీ నుండి ఏదైన వేరుచేయగలవా..... || నా మనసే ||

రాజ్యములను పాలించిన రాజులను చూసాను
పూజలందుకున్నారని వారి కొరకు విన్నాను
దేవుడవైయుండి మనిషి పాదాలు కడిగిన
దీనుడైన దేవునిగ నిన్ను చూచుచున్నాను
ప్రభువా నిన్ను చూచుచున్నాను..... || నా మనసే ||

చిన్ని చిన్ని పక్షులకు గుళ్లుండుట చూసాను
ఇంటినే స్వర్గముగ చేసుకున్నారని విన్నాను
జగమంతా నీదైనా జనమంతా మారాలని.....
తలవాల్చగ స్థలము లేని నిన్ను చూచుచున్నాను
యేసు నిన్ను చూచుచున్నాను..... || నా మనసే ||

రాజులకు రాజువయ్యా యేసుక్రీస్తు ప్రభువ
నీ వలనే వచ్చింది ఏ రాజుకైన విలువ
నీవు స్థాపించిన రాజ్యములో కలతలేమి ఉండవని
అది ప్రేమకు ఐక్యతకు నిలయమని విన్నాను
క్రీస్తు రాజ్యములో ఉన్నాను..... || నా మనసే ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area