Type Here to Get Search Results !

Akashana Kristu Janma Dinana Song Lyrics | ఆకాశాన క్రీస్తు జన్మదినాన Song Lyrics | Bro VP Reddy Songs Lyrics

Akashana Kristu Janma Dinana Song Lyrics | ఆకాశాన క్రీస్తు జన్మదినాన Song Lyrics | Bro VP Reddy Songs Lyrics

Akashana Kristu Janma Dinana Song Lyrics
పల్లవి.
ఆకాశాన క్రీస్తు జన్మదినాన
అరుదైన తార ఆనాడు వెలిసింది
ఈ లోకాన చిమ్మ చీకటిలోన
నిన్ను ఒక తారగా వెలగమని పాఠం చెబుతుంది
జ్ఞానులకే దారిని చూపే నక్షత్రములా మారాలంటుంది
క్రీస్తు వైపే నడిపించేందుకు
తనలాగే నువ్వు నడవాలంటుంది
లోకులంతా ఆ వెలుగులో యేసుక్రీస్తును గుర్తించాలంది
కడవరకు నమ్మకంగా వెలిగి రాలిపోవాలంటుంది
నక్షత్రం నేర్పే క్రిస్మస్ పాఠంమిది ...... ......
............ ఆకాశాన క్రీస్తు జన్మదినాన ఈ లోకాన చిమ్మ చీకటిలోన ...

ఇంటిమీద వెలిగే తారలా ఉండిపోతే ఏం లాభం
వీధిలోన నిలిపే సార్ల ఎండిపోతే ఏ లాభం
గాలిలోన కట్టేమేడలా కూలిపోతే ఏం లాభం
నీటిలోన మునిగే ఓడలా బ్రదలైతే ఏం లాభం
ఏడాదికి ఒక్కసారే వెలిగి ఆరిపోతావా
నిరంతరం వెలిగే జ్యోతి లాగ మారవా
లోకానుసారంగా బ్రతికి చచ్చిపోతావా
మరణం వరకు నువ్వు నమ్మకముగా ఉండవా
జీవ వాక్యమును చేతపట్టి లోకమందు వెలగవా... ..
... ఆకాశనా క్రీస్తు జన్మదినాన ఈ లోకాన చిమ్మ చీకటిలోన

గాలివాటు రానిచోటులో దీపముండి ఏం లాభం
తేటకన్ను లేని మనిషిలో ఊపిరుండి ఏం లాభం
నూనె లేక ఆరిన దివిడితో సిద్ధపడి ఏం లాభం
చీకటిగా మారిన వెలుగుతో దేవుడికి ఏం లాభం
నీతిమార్గమున వెలిగి అనేకులను త్రిప్పుదువా
ఆకాశ మండలములో జ్యోతి వలె ఉంటావా
రాజువైన యాజకునిగా సమూహములో కనబడవా
ఆశ్చర్యకరమైన వెలుగులోన నిలబడవా
క్రీస్తును పోలి బ్రతికి చివరివరకు ప్రకాశించవా.....

ఆకాశాన క్రీస్తు జన్మదినాన
అరుదైన తార ఆనాడు వెలిసింది
ఈ లోకాన చిమ్మచీకటిలోన
నిన్ను ఒక తారగా వెలగమని పాఠం చెబుతోంది
జ్ఞానులకే దారిని చూపే నక్షత్రంలా మారాలంటుంది
క్రీస్తువైపే నడిపించేందుకు
తనలాగే నువ్వు నడవాలంటుంది
లోకమంతా ఆ వెలుగులో యేసుక్రీస్తును గుర్తించాలంది
కడవరకు నమ్మకంగా వెలిగి రాలిపోవాలంటుంది
క్రిస్మస్ పరమార్ధం ఇక్కడ దాగుంది. ......

...... ఆకాశాన క్రీస్తు జన్మదినాన ఈ లోకన చిమ్మచీకటిలోన . ..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area