Ganamu cheyudu Song Lyrics | గానముఁ జేయుఁడు Song Lyrics | Old Telugu Christian Song Lyrics
గానముఁ జేయుఁడు సుకీర్తనను యెహోవాను
గూరిచి క్రొత్తఁ గాను రక్తిగను ||గానము||
1. తన్నామము నుతించి యతని రక్షఁ జెన్నుఁగ సారెఁ
బ్రసిద్ధముఁ జేసి పన్నుగ నన్యులలో దన్మహిమ యం
దున్నత చిత్రములను జాటండి ||గానము||
2. ఘనతయు మహత్మ్యమును దద్ఘనని యెదుటనుండు
ఘనబలమును వినతమౌ సౌందర్యమును నతనివి
నిర్మల స్థలమున విలసిల్లు ||గానము||
3. పరిశుద్ధాలంకారముతో నా పరమాత్మారాధన పరులై
యుండండి ధరణి సకల జనులారా లోక గురుని
యెదుట భీతిఁ గొనుచు నుండండి ||గానము||
4. పరిపాలించుచున్నాఁడనుచు తోడి
నరులతోఁజెప్పుఁడిద్ధరఁ గదకుండ స్థిరముగఁ జేయు
సత్యముగా జనుల కరిమురిగాను న్యాయము విమర్శించు ||గానము||
5. ఏమనిన నా మహాత్ముండు వచ్చు నీ మహికి న్యాయము
నేర్పరచుటకు భూమిజనులకు నీతి సత్యములథో
మించు న్యాయము విమర్శించు ||గానము||
6. జనులారా యా యెహోవాకు మహిమను బలమును
సమర్పణము జేయండి వినయముతోఁ గానుకలను
తీసి కొని తత్ప్ర్రాకారమందున వసియింపండి ||గానము||