Type Here to Get Search Results !

Devaadhi devaa Prabhuvula Prabhu Song Lyrics | దేవాది దేవా ప్రభువుల ప్రభూ Song Lyrics

Devaadhi devaa Prabhuvula Prabhu Song Lyrics | దేవాది దేవా ప్రభువుల ప్రభూ Song Lyrics

Devaadhi devaa Prabhuvula Prabhu Song Lyrics
పల్లవి : దేవాది దేవా ప్రభువుల ప్రభూ
రాజుల రాజా హల్లేలూయ

1. నీ రక్తముతో విమెాచించి - నీ రక్తముతో సంపాదించి
పరలోక రాజ్య ప్రజలతో జేర్చి - పరలోక పాటన్ నా కొసగితివి
|| దేవాది దేవా ||

2. జీవిత నావలో తుఫాను రేగ - భయపడకుడని అభయము నిచ్చి
జయప్రదముగా నన్ను నడిపించి - జయజీవితము నా కొసగుచున్న
|| దేవాది దేవ ||

3. పేరు పెట్టినన్ ప్రేమతో పిలిచి - కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి
అరమర లేక నన్నాదరించి - పరలోక దర్శనంబిచ్చితివి
|| దేవాది దేవ ||

4. మరణ పాత్రులం యిద్దరణిలోన - దురు ఋణముల స్మరణను మాన్ని
ఏర్పారచుకొంటివి నేర్పుతో మమ్ము - నీ రాజ్యమందు రాజులన్ జేసి
|| దేవాది దేవ ||

5. శోధనగాధల కష్టములలో - నా దుఃఖములలో నే నేడ్వకుండా
నీ దయ నాపై నిండార నింపి - ఓదార్పు నన్ను నీ దారి నడుపు
|| దేవాది దేవ ||

6. ప్రతి వత్సరము దయతోడ నింపున్ - ప్రభు జాడలు సారము జల్లున్
ప్రతి బీడునూ సారము చిలకన్ - ప్రతి పర్వతము ఆనందించున్
|| దేవాది దేవ ||

7. పరలోక పరిశుద్ధ సంఘంబు యెదుట - సర్వశక్తి గల క్రీస్తుని యెదుట
పరలోక నూతన గీతముపాడ - జేర్చితివి నన్ నీ జనమునందు
|| దేవాది దేవ ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area