Type Here to Get Search Results !

Naa korakai anniyu chesenu yesu lyrics | నాకొరకై అన్నియు చేసెను యేసు Song Lyrics

Naa korakai anniyu chesenu yesu lyrics | నాకొరకై అన్నియు చేసెను యేసు Song Lyrics

Naa korakai anniyu chesenu yesu lyrics
పల్లవి: నాకొరకై అన్నియు చేసెను యేసు
నాకింక భయము లేదు లోకములో

అనుపల్లవి: నాకొరకై అన్నియు చేసినందులకు
నేను రక్షణ పాత్రను యెత్తి ఆరాధించెదన్

1. క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను
క్షామంతీర్చి ఏలీయను ఆశీర్వదించెన్
క్షామం తీరే వరకు ఆ విధవరాలి
ఇంట నూనెకైన పిండికైన కొరత లేదు

2. ఆకాశపక్షులను గమనించుడి
విత్తవు అవి పంటను కోయవు
వాటిని పోషించునట్టి పరమపితా - మమ్ము
అనుదిన మద్భుతంబుగా నడుపున్

3. ఏమి ధరింతుమని చింతపడకు
అడవి పుష్పములను తేరిచూడుము
అడవి పువ్వుల ప్రభు అలంకరింప - తానే
నిశ్చయంబుగా మమ్ము అలంకరించును

4. రేపటి దినము గూర్చి చింతపడకు
ఆప్తుడేసు నాకుండ భయమెందుకు
రేపుదాని సంగతులనదే చింతించున్ - ఏ
నాటికీడు ఆనాటికే ఇలచాలును

5. ఆశీర్వదించెడి యేసు అరణ్యములో
పోషించెను ఐదువేలమందిని కూడ
తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ - యేసు
తన్ను తానే అర్పించెను నా కొరకై

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area