Type Here to Get Search Results !

Naa Praana Nesthama Lyrics | నా ప్రాణ నేస్తమా Song Lyrics

Naa Praana Nesthama Lyrics | నా ప్రాణ నేస్తమా Song Lyrics

Naa Praana Nesthama Lyrics
నా ప్రాణ నేస్తమా నా యేసు దైవమా 2
నీ ధ్యాసలో నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా2
"నా ప్రాణ నేస్తమా"
ఆశ తీరా సేవించినా తియ్యనైన నీ ప్రేమను
అంతులేని ఆ ప్రేమలో పరవశించి కిర్తించనా
"నా ప్రాణ నేస్తమా"

1
నీవే ఉదయం నీవే అభయం నీతోనే జీవితo
నీవే శరణం నాలో అనిశం నీ ప్రేమ శాశ్వతం
మరువలేని నీ స్నేహము మధురమైన సంబంధము
కనులలోన నీ రూపము వెలిగే నాలో నీ దీపము
పలికే నాలో గీతమై నీదు ప్రేమ సంగీతమై
"నా ప్రాణ నేస్తమా"
2
నీవే శిఖరం చూపే గమనం నీలోనే అమృతం
నీతో సమయం కోరే తరుణం నీ ప్రేమ పావనం
శిదిలిమైన నాప్రాణము కరుణ చూపే నీవాక్యము
సిలువ చాటు నీ త్యాగము తెలిపే ప్రేమ సందేశము
పదములైన చాలునా నీదు ప్రేమ నేపాడనా
"నా ప్రాణ నేస్తమా"

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area