Uhinchaledayya ee jeevitham | ఊహించలేదయ్యా ఈ జీవితం Song Lyrics | Jesus Songs Lyrics in Telugu
పల్లవి : ఊహించలేదయ్యా ఈ జీవితం
వర్ణించలేనయ్యా ఈ భాగ్యం
తులువనైనా నాకు ఇంత విలువ కలిగినని
తూలిరాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని
II ఊహించలేదయ్యా II
1. మనుషుల మనసులలో ఏ చుట్టూ లేకున్నా
మంచిదైన నీ మదిలో నాకు చోటు నిచ్చావు
పలుకరించు వారెవరు నా దరికి రాకున్నా
నన్ను పలుకరించగా పరితపిస్తూ వుంటావు
కంటిపాపలా నన్ను కాపాడు కుంటావు.......2
చంటిపాపల నన్ను చంక నెత్తుకుంటావు.......2
II ఊహించలేదయ్యా II
2. అపరాధిని నను ప్రేమించి ఆ శక్తితో నను పిలిచి
నీ దివ్య రక్తముతో నిలువెల్లా కడిగావు
అగ్నిబిలముకై పరుగెత్తే నా అడుగులనే గమనించి
ఆశ్చర్యమైన రీతిలో నన్ను ఆదుకున్నావు
నీ జీవగ్రంథములోన నా పేరు వ్రాశావు.......2
నీతి పరుల రాజ్యములోన నాకు స్థలము నిచ్చావు.......2