Type Here to Get Search Results !

Neethone anubandham song lyrics | నీతోనే అనుబంధం నీలోనే ఆనందం Song Lyrics

Neethone anubandham song lyrics | నీతోనే అనుబంధం నీలోనే ఆనందం Song Lyrics

Neethone anubandham song lyrics
పల్లవి: నీతోనే అనుబంధం నీలోనే ఆనందం
నీ ప్రేమ ప్రాకారము యేసయ్య కావాలి నీ స్నేహము - 2
ఎవరున్నా లేకున్నా ఏమైనా కాకున్నా
నీతోనే నా పయనము
నీ ప్రేమ ప్రాకారము యేసయ్య
నీ పొందు నా భాగ్యము - 2 [నీతోనే అనుబంధం]

చరణం 1 : నా కాలగతులన్నీ నీ వశమని
నిలిచి యున్నాను నీ చెంతనే - 2
నా దాగు చోటు నీవేనని నమ్మిక యుంచాను నీ మీదనే
ఔనన్నా కాదన్నా వెలుగైనా వెతలైనా
నీతోనే నా పయనము
నీ ప్రేమ ప్రాకారము యేసయ్య
నీ పొందు నా భాగ్యము - 2 [ నీతోనే అనుబంధం]

చరణం 2 : నా ఊపిరయ్యింది నీ శ్వాసని నిత్యమూ
నీకెప్పుడు నా ధ్యాసని - 2
నీ ప్రాణమిచ్చింది నా కొరకని
నీలాంటి ప్రేమికుడు ఇల లేడని
చావైనా బ్రతుకైనా మేలైనా కీడైనా
నీతోనే నా పయనము
నీ ప్రేమ ప్రాకారము యేసయ్య
నీ పొందు నా భాగ్యము - 2 [ నీతోనే అనుబంధం]

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area