Type Here to Get Search Results !

Manasa nee priyudu yesu | మనసా నీ ప్రియుడు యేసు Song Lyrics

Manasa nee priyudu yesu | మనసా నీ ప్రియుడు యేసు Song Lyrics

Manasa nee priyudu yesu
పల్లవి : మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే
మహదానందమే తనతో జీవితం
ఓ మనసా ఇది నీకు తెలుసా!

1.దివ్యమైన సంగతులెన్నో నీ ప్రియుడు వివరించగా
ఉత్సాహ ధ్వనులతో వూరేగితివే
ఉరుముల ధ్వనులన్నీ క్షణికమైనవేగా
దిగులు చెందకే ఓ మనసా
౹౹మనసా౹౹

2.ఆశ్చర్య కార్యములెన్నో నీ ప్రియుడు చేసియుండగా
సంఘము ఎదుట నీవు సాక్షివైతివే
ఇహలోక శ్రమలన్ని స్వల్పకాలమేగా
కలవరమేలనే ఓ మనసా
౹౹మనసా౹౹

3.నిష్కళoకరాలవు నీవని నీ ప్రియుడు నిను మెచ్చెనే
కృపాతిశయముచే నీవు ఉల్లసించితివే
దుష్టుల క్షేమము నీ కంట బడగా
మత్సరపడకే ఓ మనసా
౹౹మనసా౹౹

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area