Type Here to Get Search Results !

Naa Pakshamai Vunnavadu Song Lyrics | నా పక్షమైయున్న వాడు Song Lyrics | Emmanuel Ministries Songs

Naa Pakshamai Vunnavadu Song Lyrics | నా పక్షమైయున్న వాడు Song Lyrics | Emmanuel Ministries Songs

Naa Pakshamai Vunnavadu Song Lyrics
పల్లవి : నా పక్షమైయున్న వాడు బలశూరుడు వర్ణించలేని బహుసుందరుడు ( 2 )
నాకు విరోధముగా రూపించేఏ ఆయుదము వర్థిల్లదు
అగ్ని వంటి శోధనలే అయినా కృపలో సాగెదను ( 2 )
తలచిన ప్రతి క్షణము నిత్యానందమే
వేసేప్రతి అడుగు విజయానందమే( 2 ) ||నా పక్ష||

చరణం : ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలను
నాపైన నీకున్న అంతులేని ప్రేమకు
కరుణారెక్కలతో నన్ను ఆవరించి కన్నతండ్రి
వలె నన్ను ఆదరించెను ( 2 )
కమ్మనైన ప్రేమను చూపిన కమనీయుడా
కన్నులారా నిన్ను చూసి పరవసింతును ( 2 )
ఎండిన ఎముకలకు జీవమునిచ్చిన
నీ జీవపు మాటలే నాకానందము ( 2 ) || నా పక్ష ||

చరణం : విశ్వాస భాటలో నా ప్రక్క నిలచి
సింహపు నోట నుండి తప్పించినావు
కదనరంగములో కదముత్రొక్కు ఖడ్గమువై
శత్రువు గుండెల్లో సింహా స్వప్నమైయ్యావు ( 2 )
విశ్వాస కర్తయైనా నీ ముఖము చూచుచు పయనించెదను గురి యోద్దకే ( 2 )
నా ప్రాణము పోయినను పరుగును ఆపను
నీ శక్తి కార్యాలను ఆస్వాదింతును ( 2 ) || నా పక్ష ||

చరణం : శుభప్రదమైన శోభితనగరులో
మహారాజు యేసయ్యే నా ముఖ్య సంతోషం
ఎవ్వరు పాడని నవగీతమును
దూతలతో కలసి నే పాడెదను ( 2 )
రమ్యమైన సీయోనులో రారాజుగా నీవే
ప్రతి బాష్ప బిందువును తుడిచేదవు ( 2 )
అపురూపమైనది నీ మహిమాలోకమే
ఆ నిర్మలరాజ్యములో ప్రకాశింతును ( 2 ) || నా పక్ష ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area