Type Here to Get Search Results !

Yesayya nee krupa naku chalayya song lyrics | యేసయ్యా .. నీ కృప నాకు చాలయ్యా Song Lyrics

Yesayya nee krupa naku chalayya song lyrics | యేసయ్యా .. నీ కృప నాకు చాలయ్యా Song Lyrics

Yesayya nee krupa naku chalayya song lyrics
యేసయ్యా .. నీ కృప నాకు చాలయ్యా..
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా …
నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా.. /2/
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా /2/నీకృప/

1. మహిమను విడిచి – మహిలోకి దిగివచ్చి
మార్గముగా మారి – మనిషిగ మార్చావు
మహినే నీవు మాధుర్యముగ మార్చి
మాదిరి చూపి మరు రూపమిచ్చావు ) /2/
మహిమలో నేను మహిమను పొంద
మహిమగ మార్చింది నీకృప /2/ యేసయ్యా/2/నీ కృప/

2. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో – ఆనందింపజేసి
ఆనంద తైలముతో – అభిషేకించావు) /2/
ఆశతీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప /2/యేసయ్యా/2/నీ కృప/

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area