ఏ రాగం నాకు రాదు Song Lyrics | Ye Ragam Naku Radu song Lyrics | Telugu Worship Song Lyrics
ఏ రాగం నాకు రాదు ఎలుగెత్తి పాడుటకు
ఏ జ్ఞానము నాకు లేదు నిన్ను గూర్చి చెప్పుటకు
నిన్నే నమ్ముకున్నాను నీపై అనుకున్నాను
ఇల పాడాను ఒక పాట
నా పాటకు ప్రాణం నీవయ్యావు యేసయ్యా
నా నోటికి నోరై నిలిచావు నా యేసయ్యా
బలమైన ఉజ్జీవం పరిశుద్ధాత్మ అభిషేకం
నిన్నుగానం చేయుచుండగా ప్రజలందరూ పొందాలి
నే పాడే ప్రతిపాట నిన్నే ఆరాధించాలి
నే పలికే ప్రతీ పదం నీ మహిమను ఘనపరచాలి
నీవు చేసిన ఆశ్చర్యాలు నీవు చూపిన అద్భుతాలు
నా స్వరము నుండి నీవే విశ్వమంతా వినిపించాలి
నే పాడే ప్రతి పాట నీ నామము ఘనపరచాలి
నే పలికే ప్రతీ పదం నీ కీర్తిని కొనియాడాలి