Type Here to Get Search Results !

అడుగుచున్నామో దేవ Song Lyrics | Aduguchunnamo Deva Song Lyrics - Andhra Kraistava Keerthanalu

అడుగుచున్నామో దేవ Song Lyrics | Aduguchunnamo Deva Song Lyrics - Andhra Kraistava Keerthanalu

Aduguchunnamo Deva Song Lyrics
అడుగుచున్నా మో దేవ కడు దయను గావఁ జెడుగుల మైన మేము
నిన్నడుగుటకు నే బిడియ మొందము అడుగుఁడి మీ కిడియెద నంచు నాన తిచ్చిన వాగ్దానమునఁ గని ||యడుగు||

వేడు కలరఁగఁ గూడి నిను గొని యాడి యడిగెడు నీదు భక్తులఁ
గోడు గని దయతోడ నెప్పుడు వీడక నెరవేర్తు వని ని ||న్నడుగు||

సారె సారెకు నిన్ను విడిచి ఘోర దురితపు భారమందుఁ జేరి
నిను మఱచితిమి గద మా క్రూరత నెడ బాపు మని ని ||న్నడుగు||

దుష్టుడు మాతోడఁ బోరఁగ శ్రేష్ఠ మగు మానిష్ఠ తోడుత
కష్ట మనక వాని గెల్వఁ బుష్టిని బుట్టించు మని ని ||న్నడుగు||

తోర మగు విశ్వాస నిరీక్షణ కూరిమి విమలాత్మ వరములు వారక
హృదయాంతరంబులఁ జేరిచి మము వెలిగించు మని ని ||న్నడుగు||

మోద మొప్పఁగ నీదు వాక్యము మేదినిపై బోధపరచెడు
బోధ కులపై శోధనంబులు పొర్లి రాకుండాదరింప ||నడుగు||

దురితముల చే భరితు లయ్యెడు నరులపై నీ కరుణఁ జూపి
గురుతరంబగు మారు పుట్టుక వరముఁ గుమ్మరించు మని ని ||న్నడుగు||

రోగములచే సేగి నొందుచు జాగు సేయక నినుఁ దలఁచుచు
బాగు గోరుచు నున్న భక్తుల రోగములు వెడలించు మని ని ||న్నడుగు||

ధరణిపైని మరణ మయ్యెడు తరుణమందో కరుణా కలితా
పరమ పురమునందుఁజేరి వర సుఖంబు లనుభవింప ||న్నడుగు||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area