వందనాలు వందనాలు song lyrics | నీవు లేని చోటేది యేసయ్యా Song Lyrics - Telugu Worship Song Lyrics
వందనాలు వందనాలు
వరాలు పంచే - నీ గుణ సంపన్నతకు
నీ త్యాగశీలత కు నీ వశమైతినే
అతికాంక్షనీయుడా నా యేసయ్యా - 2
1. ఇహలోక ధన నిధులన్నీ
శాశ్వతము కావని ఎరిగితిని
ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే
ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివి "వందనాలు"
2. యజమానుడా నీ వైపు
దాసుడనై నా కన్నులెత్తగా
యాజక వస్త్రములతో నను అలంకరించి
నీ ఉన్నత పిలుపునకు స్థిరపరచితివే "వందనాలు "
3. ఆద్యంతము లేని అమరత్వమే నీ స్వంతము
నీ వారసత్వపు హక్కులన్నియు
నీ ఆజ్ఞను నెరవేర్చగ దయ చేసితివి "వందనాలు "