నిన్ననేడు నాలోఉన్న కన్నీరంత Song Lyrics | Ninna nedu nalo unna kannirantha Lyrics - Jesus songs

"నిన్ననేడు నాలోఉన్న కన్నీరంత
ఈనాడే తొలగించావ నా యేసయ్య" "2"
'నీవుగాక నాకు యిలలో ఎవ్వరులేరయ్యా
నీతోగాక నాకు ఏ స్నేహం
అక్కరలేదయ్యా'
నిన్ననేడు
1."బాధలెన్నో అనుభవించాను
వేదనతోనే బహుగ కృంగాను" "2"
'తాకాను నీవస్త్రం
పొందాను అద్భుతం' "2"
నీలోవున్న మహిమ నన్ను
స్వస్థపరచగా..
నిన్ననేడు
2."ఆదరించె వారులేక
అలసిపోయాను అవమానాలతో" "2"
'చేరాను నీచెంత
తెలిపాను నా చింత' "2"
అవధులులేని ఆనందముతో
ఆరాధింతును..
నిన్ననేడు
3."ఉన్నతమైన రాజ్యము కొరకై
జీవించెదను నా జీవితాంతం" "2"
'పొందెదను పరలోకం
ఉండెదను చిరకాలం' "2"
నీకృప నన్ను విడువలేదు
ఈధరలోన..
నిన్ననేడు