ఎబినేజరే Song Lyrics | Ebenezare Song Lyrics - Christian lyrics telugu
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించేదము "2"
నీ కనుపాపలే నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం "2"
ఎబినేజరే - ఎబినేజరే
ఇంత కాలము కాచితివే
ఎబినేజరే - ఎబినేజరే
నా తోడువై నడిచితివే
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కౌగిలిలో దాచితివి స్తోత్రం
1.ఎడారిలో ఉన్న నా జీవితమును
మేళ్లతో నింపితివి "2"
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం "2"
"ఎబెనేజరే "
2.ఆశలే లేని నా బ్రతుకును
నీ కృపతో నింపితివి
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి "2" "ఎబెనేజరే "
3. జ్ఞానుల మధ్యన నను పిలిచిన నీ పిలుపే
ఆశ్చర్యం ఆశ్చర్యమే "2"
నీ పాత్రను కానే కాదు స్తోత్రం
కేవలం నీ కృప యే స్తోత్రం "2"
"ఎబెనేజరే"