ద్రాక్షవల్లీవి నీవైతే Song Lyrics | Drakshavallivi Neevaithe Song Lyrics - Christian Melody Song Lyrics
ద్రాక్షవల్లీవి నీవైతే తీగెగ నేను ఎదిగితిని
తండ్రితోటలో నేనాట బడితి
ఎంత ధన్యత ఈ మహిలో
చల్లగాలులు వీచగా
కాంతి కిరణాలు ప్రసరించగా
నీతి సూర్యుని నిజ కాంతిలోన
తేజరిల్లెడి బ్రతుకు తోడ
రక్షణ తోటలో విరివిగ పెరిగి
నీటియోరన నిలిచితిని
కొమ్మకొమ్మను చూడగా
తీగలెన్నో అగుపించెనే
ఆకు మాటున తీగెగాపున
మొలవ నున్నవి ఫలములెన్నో
నిలిచె అందులో ఫలితము కొరకై
కలిగె స్నేహము యేసునితో