ఆనందగీతము నే పాడనా Song Lyrics | Ananda Geethamu Ne Padana Song Lyrics - Emmanuel Ministries Song Lyrics
పల్లవి : ఆనందగీతము నే పాడనా హర్షధ్వనులతో నా యేసయ్య..
ఆరాధించి నిన్ను పొగడన నాధు ప్రియుడా నా యేసయ్య..
ఆరాధనకు యోగ్యుడవు నాదు స్తుతిపాత్రుడా
నిత్యము నిన్ను కీర్తింతును నాదు నజరేయుడా .. ||2|| ||ఆనంద||
చరణం : ఆశ్రయుడవై ఆదుకున్నావు
నాదు బ్రతుకును నీ కృపలో ..||2||
దినమెల్ల నీ స్తుతిగాణమే నిండెను నా మదిలో
ఎల్లవేళలా నీ సన్నీదిని నాకు నొసగుము నా దేవా ...||2|| ||ఆనంద||
చరణం : కృపామయుడవై కనికరించావు
క్షేమముతో నన్ను తృప్తిపరిచావు ..||2||
కనికరుడా కమనియుడా క్షీరాంబృతముతో నింపితివి
మాధుర్యమే నీ సహవాసము నన్ను విడువకు నా దేవా ..||2|| ||ఆనంద||
చరణం : సైన్యములకు అధిపతివి నీవే
ఉన్నవాడవు అనువాడవు నీవే ..||2||
పరిశుద్ధుడా పరిపూర్ణుడా పవిత్రతతో నన్ను నింపుమయ్యా
పరవాసినై నీ ముఖ ధర్శనం చేయు భాగ్యము నోసాగుమయ్యా ..||2|| ||ఆనంద||