Type Here to Get Search Results !

Neevu Thadithe Song Lyrics | నీవు తడితే తలుపు తీయనా ప్రభు Song Lyrics - Kalpana Christian Song Lyrics

Neevu Thadithe Song Lyrics | నీవు తడితే తలుపు తీయనా ప్రభు Song Lyrics - Kalpana Christian Song Lyrics

నీవు తడితే తలుపు తీయనా ప్రభు
నాలో నీవుంటే ఇంకేల నాకు భయం (2) ||నీవు||

పాపముతో నిండియున్న నా బ్రతుకును
పరిశుద్ధ పరిచావు నా యేసయ్యా
పాపములో జీవించుచున్న నాపై
ప్రేమ చూపి నా తలుపు తట్టావయ్యా (2)
నా చీకటి బ్రతుకులో వెలుగును నింపి
నన్ను నడిపించగ వచ్చావయ్యా (2) ||నీవు||

తెరిచాను నా తలుపులు రావా ప్రభు
ఇక నన్ను వీడి నిన్ను వెళ్లనివ్వను
నాలోన నీవుండి పోవాలి
నీతోనే నడవాలి ఇక మీదట (2)
రక్షణనే కేడెము చేత పట్టి
ప్రతి తలుపును తట్టి నిన్ను మహిమ పరచెద (2) ||నీవు||

విలువలేని నన్ను నీవు ఎంచుకొంటివి
వాక్యమనే ధ్యానముతో నన్ను నింపుమా
స్వస్థతనే వరముల దయచేయుమా
కడ వరకు పరుగెడుదును నీ బాటలో (2)
ఎల్లవేళలా నాతో ఉండి నన్ను
చేయి పట్టి నడిపించు నా యేసయ్యా (2) ||నీవు||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.