Type Here to Get Search Results !

యేసు నీ నామామృతము Lyrics | Yesu nee namamrutham Song Lyrics - Old christian song Lyrics

యేసు నీ నామామృతము Lyrics | Yesu nee namamrutham Song Lyrics - Old christian song Lyrics

యేసు నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యా (2) దేవ
మా – దోషములను హరించి మోక్షని
వాసులుగా జేయుటకు – భాసుర ప్రకాశమైన ||యేసు||

వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి (2) దేవ
యెంతో – కీడు జేసిన పాడు వైరిని
గోడుగో డనంగ వాని – తాడనము జేసితివి ||యేసు||

పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా (2) దేవ
నీ – దాపు జేరిన వారి కందరి
కాపదలు బాపి నిత్య కాపుగతి జూపినావు ||యేసు||

అక్షయ కరుణేక్ష భువన – రక్షకా నీవే (2) దేవ
మమ్ము పక్షముగ రక్షించి మోక్షసు
రక్షణకు దీక్ష గొని – వీక్షితులమైన మాకు ||యేసు||

అందమగు నీ మందిరమున – బొందుగా మేము (2) దేవ
నీ – సుందర కరుణామృతము మా
డెందముల యందు గ్రోలు – టందుకు సుందరమైన ||యేసు||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area