వేటగాని ఉరిలో నుండి Lyrics | Vetagani Urilo Nundi Lyrics - Search christian song Lyrics

వేటగాని ఉరిలో నుండి
నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రింద
నాకాశ్రయమిచ్చావు (2)
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా శైలమా
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా శృంగమా నా కేడెమా
ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన (2)
రాత్రి వేళ భయముకైననూ
పగటి వేళ బాణమైననూ
రోగము నన్నేమి చేయదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||
వేయిమంది పడిపోయినా
పదివేల మంది కూలిపోయినా
అపాయము రానే రాదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||
మానవులను కాపాడుటకు
నీ దూతలను ఏర్పరిచావు
రాయి తగలకుండా
ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా
Search christian song Lyrics