Enta Madhuram Song Lyrics | ఎంత మధురం Song Lyrics - Anwesha Christian Song Lyrics

స్వచ్ఛమైన తల్లి ప్రేమలా...... కమ్మనైన తల్లి పాలలా.........
ఎంత మధురం మదురాతి మధురం
యేసుని వాక్యం సర్వదా మదురం "2"
నిన్న నేడు ఒక్కటే రీతిగా నిరతము ఒకే మాటగా "2"
మారనీ మార్పు లేని యేసు మాట మదురం"2"
స్వచ్ఛమైన తల్లి ప్రేమలా.... కమ్మనైన తల్లి పాలలా
జుంటితేనె దారల కన్నా... మదురమైనది
సత్యమైన తండ్రీ మాటలా....నమ్మదగిన చెలిమి తోడుగా
ప్రియమైన వారల కన్నా... కోరదగినది "2"
హృదయమును సంతోషపరచును ప్రాణమును సంతృప్తి పరచును
జీవపుప్రేమామృతమైన యేసు మాట మదురం "2"
" ఎంతమదురం"
పారుతున్న జీవధారలా... ప్రాణ్హులకు ఆదారముగ
దప్పికగల వారలకెల్లా... జీవమైనది
వెలుగుతున్న జీవజ్యోతిలా ... వేదనలో ఆశజ్యోతిగా
నిరాశగల వారలనెల్లా.. బలపరుచునది "2"
పాపములను ప్రత్యక్షపరచును.. ఫలమును ప్రత్యేకపరచును
పరమాజీవాహారమైన యేసుమాట మదురం"2"
"ఎంతమదురం"